Jayalalitha: జయలలిత అనారోగ్యానికి కారణం అదే.. మరో సంచలన విషయం వెలుగులోకి!

  • జయ ప్రాథమిక చికిత్సలో మోతాదుకు మించిన స్టెరాయిడ్లు
  • అనారోగ్యానికి అదే కారణమన్న ఆక్యుపంక్చర్ వైద్యుడు
  • జస్టిస్ అరుముగస్వామి కమిషన్‌కు సాక్ష్యం

జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ అరుముగస్వామి కమిషన్ మరో సంచలన సాక్ష్యాన్ని నమోదు చేసింది. జయ అనారోగ్యానికి అసలు కారణం స్టెరాయిడ్లేనని ఆక్యుపంక్చర్ వైద్యుడు శంకర్ పేర్కొన్నారు. గతంలో ఆమెకు ఆక్యుపంక్చర్ వైద్యం చేసిన ఆయన అరుముగస్వామి కమిషన్ ఎదుట మంగళవారం హాజరయ్యారు. జయను ఆసుపత్రిలో చేర్చడానికి ముందు ఆమె నివాసంలో చికిత్స చేశారని, ఆ సమయంలో ఆమెకు మోతాదుకు మించి స్టెరాయిడ్లు ఇచ్చారని కమిషన్‌ ఎదుట సాక్ష్యం ఇచ్చారు.

‘‘జయలలిత అస్వస్థతకు గురైన వెంటనే ఆమె నివాసంలోనే ప్రాథమిక చికిత్స చేశారు, అప్పుడు ఆమెకు భారీగా స్టెరాయిడ్లు ఇచ్చినట్టు గుర్తించాం’’ అని శంకర్ పేర్కొన్నట్టు సమాచారం. జయలలిత మృతిపై సమగ్ర విచారణకు ఏర్పాటైన అరుముగస్వామి కమిషన్ ఇప్పటికే పలువురిని విచారించింది. తాజాగా శంకర్ సాక్ష్యం ఇచ్చారు. జయలలితతో అత్యంత సన్నిహితంగా మెలిగిన మాజీ అధికారులను కమిషన్ విచారించనుంది. అలాగే ఈనెల 20న జయ సన్నిహితురాలు, మాజీ సీఎస్ షీలా బాలకృష్ణన్, 21న మరో మాజీ సీఎస్ రామ్మోహనరావులు విచారణ సంఘం ఎదుట హాజరుకానున్నారు. 

More Telugu News