మెగా హీరో న్యూ మూవీ షూటింగ్ మొదలైపోయింది

Tue, Dec 12, 2017, 03:50 PM
  • ఫీల్ గుడ్ లవ్ స్టోరీలో సాయిధరమ్ తేజ్ 
  • దర్శకుడిగా కరుణాకరన్ 
  • కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ 
  • శంషాబాద్ లో జరుగుతోన్న షూటింగ్      
ఇటీవలే 'జవాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయిధరమ్ తేజ్, ప్రస్తుతం వినాయక్ తో ఓ సినిమా చేస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే సాయిధరమ్ తేజ్ మరో సినిమాను ఒప్పేసుకున్నాడు. కె. ఎస్.రామారావు నిర్మిస్తోన్న ఈ సినిమాకి కరుణాకరన్ దర్శకుడు. ఈ సినిమా రెంగ్యులర్ షూటింగ్ ఈ రోజునే మొదలైంది.

సాయిధరమ్ తేజ్ .. అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్లోని సన్నివేశాలను శంషాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో ఈ సినిమాను కరుణాకరన్ తెరకెక్కిస్తున్నాడు. ఇదే తరహాలో గతంలో ఆయన నుంచి వచ్చిన 'తొలిప్రేమ' .. 'హ్యాపీ' .. 'డార్లింగ్' సినిమాలు యూత్ ను ఒక ఊపు ఊపేశాయి. అదే విధంగా సాయిధరమ్ తేజ్ ఈ సినిమాతో యూత్ కి మరింత చేరువవుతాడేమో చూడాలి.      
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement