sridevi: అప్ప‌ట్లో శ్రీదేవితో క‌లిసి డ్యాన్స్ చేసిన ఫొటోను షేర్ చేసిన అమితాబ్ బ‌చ్చ‌న్‌!

  • ‘జుమ్మా చుమ్మ షో’ పేరిట కాన్సర్ట్‌లో పాల్గొన్నా
  • 1990లో లండన్‌లోని వెంబ్లే స్టేడియంలో ఈ ఫొటో దిగాం
  • ‘జుమ్మా చుమ్మ దే దే’ పాటకు డ్యాన్స్‌ చేశా

బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ గ‌తంలో న‌టి శ్రీదేవితో కలిసి దిగిన ఓ ఫొటోను తాజాగా త‌న‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఆ ఫొటోను 1990లో లండన్‌లోని వెంబ్లే స్టేడియంలో దిగినట్లు పేర్కొన్నారు. శ్రీదేవి, ఆమిర్ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌లతో కలిసి ‘జుమ్మా చుమ్మ షో’ పేరిట కాన్సర్ట్‌లో పాల్గొన్నానని ఆయ‌న వివ‌రించారు.

ఆ స‌మ‌యంలో తాను శ్రీదేవితో కలిసి ‘జుమ్మా చుమ్మ దే దే’ పాటకు డ్యాన్స్‌ చేశానని తెలిపారు. ఆ సాంగ్‌ ‘హమ్‌’ అనే సినిమాలోనిద‌ని, అప్పటికి ఇంకా ఈ సాంగ్‌ విడుదల కూడా కాలేదని వివ‌రించారు. అమితాబ్ గుర్తుచేసుకున్న‌ ఆనాటి జ్ఞాప‌కాలు ఆయ‌న అభిమానుల‌ను అల‌రిస్తున్నాయి.  

More Telugu News