విజయ్ మరణం వెనుక బలమైన కారణం ఉండొచ్చు: నటుడు ఉత్తేజ్

12-12-2017 Tue 14:56
  • విజయ్ ఆత్మహత్య బాధాకరం
  • ఏమొచ్చినా నాన్న ఉన్నాడని చెప్పేవాడు
  • కళల ప్రపంచం మాదిరి నిజ జీవితం ఉండదు
కమెడియన్ విజయ్ ఆత్మహత్యతో తెలుగు సినీపరిశ్రమ షాక్ కు గురైంది. టాలీవుడ్ కు చెందిన పలువురు విజయ్ భౌతికకాయాన్ని కడసారి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తేజ్ మాట్లాడుతూ, విజయ్ ఆత్మహత్య వెనుక బలమైన కారణం ఉండవచ్చని చెప్పాడు. ఆత్మహత్య చేసుకోవాలంటే ఎంతో ధైర్యం, తెగింపు కావాలని అన్నాడు. ఇలాంటి ఘటనలు ఎంతో బాధను కలిగిస్తాయని చెప్పాడు. ఎన్ని సమస్యలు ఉన్నా తన తండ్రి చూసుకుంటాడని విజయ్ చెప్పేవాడని... చివరకు ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. కళల ప్రపంచంలో అందరూ సంతోషంగానే ఉంటారని... కానీ, నిజ జీవితంలో అలా ఉండదని అన్నాడు.