rajamouli: ఈ ఏడాదిలో రాజమౌళికి నచ్చిన సినిమా 'అర్జున్ రెడ్డి'!

  • సంచలన విజయం సాధించిన 'అర్జున్ రెడ్డి' 
  • ఆ సినిమాకి మంచి మార్కులు ఇచ్చిన రాజమౌళి 
  • ఏడాది మొత్తంలో ఆయన మనసు దోచింది కూడా ఇదేనట  

దర్శకుడిగా రాజమౌళి సాధించిన ఘన విజయాలను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కొన్ని సినిమాలను చూసే ఆయన, ఆ సినిమాలపై తన అభిప్రాయాన్ని వెంటనే తెలియజేస్తుంటారు. ఆయన అభినందనలు తెలియజేశారంటే చాలు .. చాలామంది దృష్టి ఆ సినిమా వైపు మళ్లుతుంది. ఆయన టేస్టుకు అభిమానులు అంతగా ప్రాధాన్యతనిస్తారు.

అలాంటి రాజమౌళి ఈ మధ్య వచ్చిన 'అర్జున్ రెడ్డి'  సినిమాను చూసి .. ఆ సినిమా టీమ్ ను ఎంతగానో మెచ్చుకున్నారు. దర్శకుడిగా సందీప్ రెడ్డికి .. నాయకా నాయికలుగా విజయ్ దేవరకొండ, షాలిని పాండేకి ఆయన మంచి మార్కులు వేశారు. అంతేకాదు తాజా ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ .. ఈ ఏడాదిలో వచ్చిన సినిమాల్లో తన ఫేవరెట్ మూవీ 'అర్జున్  రెడ్డి' అంటూ కితాబునివ్వడం విశేషం. చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా, రికార్డు స్థాయి వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే.   

More Telugu News