manasuku nachindhi: 'ప్రపంచమంత ప్రేముంటుందిరా' అంటోన్న హీరోయిన్‌.. 'మ‌న‌సుకు న‌చ్చింది' టీజ‌ర్ విడుద‌ల‌

  • సందీప్ కిష‌న్‌, అమైరా ద‌స్త‌ర్‌, త్రిధా చౌద‌రి ప్ర‌ధాన పాత్ర‌ల్లో 'మ‌న‌సుకు న‌చ్చింది'
  • విజువల్స్ ఎంజాయ్ చేయండి 
  • ఇది మీకోసమే

సందీప్ కిష‌న్‌, అమైరా ద‌స్త‌ర్‌, త్రిధా చౌద‌రి ప్ర‌ధాన పాత్ర‌ల్లో మంజుల ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న 'మ‌న‌సుకు న‌చ్చింది' టీజ‌ర్ ఈ రోజు విడుద‌లైంది. ఇందులో అమైరా ద‌స్త‌ర్ ప్ర‌కృతి ప్రేమికురాలుగా క‌న‌ప‌డుతోంది. 'ప్ర‌తి మనిషిలో ప్రపంచమంత ప్రేముంటుందిరా.. కాని 0.1 ప‌ర్సెంట్‌ కూడా బయటకి రావ‌ట్లేదు. ఒక్కసారి మన హార్టుతో మనం కనెక్ట్ అయితే ఆ ప్రేమంతా పరిచయం అవుతుంది' అంటూ హీరోతో హీరోయిన్ చెబుతోన్న డైలాగు అల‌రిస్తోంది. 'విజువల్స్ ఎంజాయ్ చేయండి. షూటింగ్ తీస్తున్న‌ప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇది మీకోసమే' అని మంజుల త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొంటూ ఈ టీజ‌ర్ విడుద‌ల చేశారు.   

More Telugu News