stunt: 62 అంత‌స్తుల భ‌వ‌నం మీద స్టంట్‌... ప‌ట్టుద‌ప్పి దుర్మరణం.. వీడియో చూడండి!

  • చైనాలో జ‌రిగిన ఘోరం
  • వైర‌ల్ అవుతున్న వీడియో
  • గ‌తంలో ఎన్నో స్టంట్స్ చేసిన వూ వాంగ్‌నింగ్‌

సోష‌ల్ మీడియాలో ప్రాచుర్యం పొంద‌డం కోసం కొంత‌మంది స్టంట్ వీడియోస్ చేస్తుంటారు. ఎంత జాగ్ర‌త్త‌గా చేసిన‌ప్ప‌టికీ కొన్నిసార్లు పరిస్థితులు అదుపుత‌ప్పి ఘోర ప్ర‌మాదం సంభ‌వించే అవ‌కాశం ఉంది. అదే రీతిలో చైనాకు చెందిన వూ వాంగ్‌నింగ్ అనే వ్య‌క్తి మ‌ర‌ణించాడు. పెద్ద పెద్ద భ‌వ‌నాల మీద నుంచి వేలాడుతూ సెల్ఫీలు తీసుకోవ‌డం, ఎక్స‌ర్‌సైజులు చేయ‌డం వంటి వీడియోలు చేసి వూ వాంగ్‌నింగ్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు.

అయితే ఈ స్టంట్స్ చేసేముందు వూ వాంగ్‌నింగ్ ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల హునాన్ ప్రావిన్స్‌లోని ఓ 62 అంత‌స్తుల భ‌వ‌నం పైనుంచి ఎక్స‌ర్‌సైజ్ స్టంట్ చేస్తుండ‌గా అనుకోని ప్ర‌మాదం జ‌రిగింది. చేతులు ప‌ట్టుద‌ప్ప‌డంతో వూ వాంగ్‌నింగ్ కింద‌ప‌డి మ‌ర‌ణించాడు. అత‌ను జారిప‌డింది వీడియోలో రికార్డ‌యింది. ఇప్పుడు ఆ వీడియో వైర‌ల్ అవుతోంది. ఈ స్టంట్ ద్వారా వ‌చ్చే డ‌బ్బును వూ త‌న పెళ్లి కోసం ఖ‌ర్చుచేయాల‌నుకున్న‌ట్లు త‌ల్లిదండ్రులు తెలిపారు. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తు ఇలా జ‌ర‌గ‌డంతో వారు క‌న్నీరుమున్నీర‌య్యారు.

More Telugu News