agyathavasi: ఆక‌ట్టుకుంటున్న `అజ్ఞాతవాసి` రెండో పాట!

  • విడుద‌ల చేసిన సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్‌
  • 'గాలి వాలుగా' అంటూ సాగే పాట
  • అద్భుతమైన ప‌దాలు రాసిన సిరివెన్నెల‌

'గాలి వాలుగా.... ఓ గులాబి వాలి... గాయ‌మైన‌దీ.. నా గుండెకు త‌గిలి' ఈ లిరిక్‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు ఇవాళ ఉద‌యం నుంచి జ‌పిస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ `అజ్ఞాత‌వాసి` చిత్రంలోని రెండో పాట లిరిక్స్ ఇవి. ఇవాళ ఉద‌యం విడుద‌లైన ఈ పాట‌ను రిపీట్ మోడ్‌లో వింటున్నారు. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి రాసిన అద్భుత‌మైన ప‌దాల‌ను వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ల్లో షేర్ చేస్తున్నారు.

చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద్ర‌న్ ఈ పాట‌ను ట్వీట్ చేశాడు. అత‌నే స్వ‌యంగా పాడిన ఈ పాట యువ‌త‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. పాట‌తో పాటు విడుద‌ల‌ చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌, కీర్తి సురేశ్‌ల ఫొటో కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇప్ప‌టికే ఈ చిత్రంలోని మొద‌టి పాట `బైటికొచ్చి చూస్తే` అభిమానుల‌ను ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే.

More Telugu News