Chandrababu: దాన్ని చూపించాలంటే జగన్ ను 100 మీటర్ల లోతుకు పంపించాలి: చంద్రబాబు

  • పోలవరం ప్రాజెక్టుపై జగన్ కు అవగాహన లేదు
  • ఏమీ తెలియని వ్యక్తి రాజకీయాల్లోకి ఎలా వచ్చారో?
  • శ్వేతపత్రం అంటే దానికేమైనా బంగారు పూత ఉంటుందా?

వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ కనిపించడం లేదంటూ ఇటీవల ఓ పెద్ద మనిషి కామెంట్ చేశారని అన్న చంద్రబాబు... దాన్ని 100 మీటర్ల లోతులో కడుతున్నారని... ఆ వాల్ ఎలా ఉంటుందో చూపించాలంటే అతడిని 100 మీటర్ల లోతుకు పంపితే సరిపోతుందని ఎద్దేవా చేశారు. కిందకు వెళ్లి చూసొచ్చిన తర్వాతైనా వాల్ ఉందనే విషయాన్ని ఆయన నమ్ముతారని సెటైర్ వేశారు.

పోలవరం ప్రాజెక్టుపై ఏ మాత్రం అవగాహన లేకుండా జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. పిల్లర్ అంటే ఏమిటో? స్పిల్ వే అంటే ఏమిటో? స్పిల్ చానల్ అంటే ఏమిటో? డయాఫ్రమ్ వాల్ అంటే ఏమిటో జగన్ కు తెలుసా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఇలాంటి నేతలు రాజకీయాల్లోకి వచ్చారంటూ చురక అంటించారు. ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించిన ప్రతిసారి ఖర్చులకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తున్నామని... ఇంతకన్నా ఏం వివరాలు కావాలని ప్రశ్నించారు. శ్వేతపత్రం కావాలని డిమాండ్ చేస్తున్నారని... దానికేమైనా బంగారు పూత ఉంటుందా? అంటూ ఎద్దేవా చేశారు.

More Telugu News