Cricket: బాలీవుడ్ తారలను పెళ్లాడిన క్రికెటర్లు వీరే!.. పటౌడీతో మొదలై కోహ్లీ వరకు..!

  • బలపడుతున్న క్రికెట్-బాలీవుడ్ వివాహ బంధం
  • 1969లో పటౌడీతో మొదలైన క్రికెటర్-నటుల వివాహాలు
  • కొనసాగుతున్న ట్రెండ్.. మున్ముందు ఇంకెవరో!

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ-బాలీవుడ్ నటి అనుష్క శర్మలు సోమవారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గతవారం రోజులుగా వీరి పెళ్లి వార్తలు హల్ చల్ చేస్తుండగా సోమవారంతో వాటికి చెక్ పడింది. గత కొన్ని సంవత్సరాలుగా బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరిగిన కోహ్లీ-అనుష్కలు వివాహ విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచారన్న విషయం ఇప్పుడు అభిమానులను వేధిస్తోంది. కాగా, బాలీవుడ్ నటిని క్రికెటర్ పెళ్లాడడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఎంతోమంది బాలీవుడ్ నటీమణులను పెళ్లాడారు. ఏ క్రికెటర్ ఎవరిని పెళ్లాడారో చూద్దాం..

* విండీస్ లెజెండ్ బ్యాట్స్‌మన్ వివియన్ రిచర్డ్స్- నీనాగుప్తాను పెళ్లాడాడు
* మన్సూర్ అలీఖాన్ పటౌడీ- షర్మిలా ఠాగోర్‌ను వివాహం చేసుకున్నాడు
* టీమిండియా స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ - గీతాబస్రాను చేసుకున్నాడు
* జహీర్ ఖాన్- ‘చక్ దే ఇండియా’ ఫేం సాగరిక ఘట్గేను నిఖా చేసుకున్నాడు
* యువరాజ్ సింగ్- ‘బాడీగార్డ్’  నటి హాజెల్ కీచ్‌ను వివాహమాడాడు
* పాకిస్థాన్ క్రికెటర్ మోసిన్ ఖాన్ - ‘నాగిని’ నటి రీనా రాయ్‌ను పెళ్లాడాడు.
* హైదరాబాద్ క్రికెటర్ అజారుద్దీన్- సంగీతా బిజిలానీని మనువాడి, తర్వాత విడిపోయాడు.

More Telugu News