Prof Haragopal: చంద్రబాబు పాలన ఇంకా పాత పద్ధతిలోనే, జగన్ వల్ల తేలదు: ప్రొఫెసర్ హరగోపాల్ కీలక వ్యాఖ్యలు

  • ఓ వెబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన హరగోపాల్
  • చంద్రబాబుది ఇంకా పాత పద్ధతిలో పాలనే
  • ప్రజా సంక్షేమంపై దృష్టిని సారించలేని చంద్రబాబు
  • జగన్ కు చుట్టూ ఉన్న కేసులు అడ్డంకులన్న హరగోపాల్

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ హరగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో వారి బలాబలాలపై ఓ వెబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను తెలిపారు. చంద్రబాబు ఇప్పటికీ పాత మూస పద్ధతిలోనే పరిపాలన సాగిస్తున్నారని, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయన మారడం లేదని అన్నారు. ప్రజా సంక్షేమంపై ఆయన సరైన విధంగా దృష్టిని సారించలేకపోతున్నారని పేర్కొన్నారు.

ఏపీలో పెద్ద సంఖ్యలో ఓటు బ్యాంకున్న క్రిస్టియన్లు, దళితులకు దగ్గర కావడం తెలుగుదేశం పార్టీ చేతకావడం లేదని తెలిపారు. ఇదే సమయంలో వైఎస్ జగన్ ను ప్రస్తావిస్తూ, తనపై ఉన్న అక్రమ కేసులు జగన్ కు ప్రతిబంధకాలని తెలిపారు. సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను కేసులు జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని తెలిపారు. ఈ కేసులన్నింటి నుంచి బయటపడటం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని పేర్కొన్నారు.

More Telugu News