Chiranjeevi: తమ్ముడి కోసం కాంగ్రెస్ కు రాజీనామా చేయనున్న చిరంజీవి!

  • జనసేనలో కీలక బాధ్యతలు ఇవ్వనున్న పవన్ కల్యాణ్
  • వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ
  • టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ 

తాను స్థాపించిన జనసేన పార్టీలో కీలక బాధ్యతలను అన్న చిరంజీవికి పవన్ కల్యాణ్ అప్పగించనున్నారా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెగాస్టార్, పవర్ స్టార్ లు కలసి పోటీ చేస్తారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు. ఈ ఇంట్రస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి, అధికారాన్ని చేజిక్కించుకోవడంలో మాత్రం విఫలమై, ఆపై పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కాంగ్రెస్ లో కేంద్ర మంత్రి పదవిని, ఎంపీ పదవిని కూడా అనుభవించారు. ప్రస్తుతం సినిమాల పేరిట క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

ఇక, ఇటీవలి తన ఏపీ పర్యటనలో చిరంజీవిని, ప్రజారాజ్యం పార్టీని ప్రస్తావించిన పవన్, తన అన్నను కొందరు వెన్నుపోటు పొడిచారని, వారందరూ తనకు గుర్తున్నారని, ఎవరినీ వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ నోటి వెంట వచ్చిన మాటలను విశ్లేషిస్తున్న రాజకీయ నిపుణులు, చిరంజీవి త్వరలో జనసేనలోకి వస్తారని అంచనా వేస్తున్నారు. చిరంజీవిని కూడా జనసేనలో కలుపుకుంటే, మరింత త్వరగా ప్రజల్లోకి వెళ్లవచ్చని పవన్ కూడా భావిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

More Telugu News