hiv: నా భ‌ర్త‌కు హెచ్ఐవీ ఉంది: ఆత్మహత్య చేసుకున్న విజ‌య్ భార్య‌

  • చాలా రోజులుగా విజ‌య్‌కి హెచ్ఐవీ ఉంది
  • అతడితో సంబంధం పెట్టుకున్న అమ్మాయే నాకు చెప్పింది
  • ఆత్మ‌హ‌త్య‌కు ఆ వ్యాధే కార‌ణం అయి ఉండొచ్చు
  • అప్ప‌ట్లో మేము చాలా అన్యోన్యంగా ఉండేవాళ్లం

చాలా రోజులుగా త‌న భ‌ర్త, సినీన‌టుడు విజ‌య్‌కి హెచ్ఐవీ ఉంద‌ని వ‌నితారెడ్డి మీడియాకు తెలిపింది. హైద‌రాబాద్‌లోని యూస‌ఫ్‌గూడ‌లోని త‌న నివాసంలో హాస్య‌న‌టుడు విజ‌య్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై వ‌నితారెడ్డిపై ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మీడియాతో మాట్లాడిన వ‌నితా రెడ్డి.. త‌న భ‌ర్త‌కు హెచ్ఐవీ ఉన్న విష‌యాన్ని ఆయ‌న‌తో శారీర‌క‌ సంబంధం పెట్టుకున్న అమ్మాయి చెప్పింద‌ని అన్నారు.

విజ‌య్ కూడా త‌న‌తో ప‌లుసార్లు ఓ మాట అన్నాడ‌ని, ఎన్నో రోజులు బ‌త‌క‌బోన‌ని చెబుతుండేవాడ‌ని తెలిపారు. ఆయ‌న ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం హెచ్ఐవీ కూడా అయి ఉండొచ్చని చెప్పారు. తాను విజ‌య్‌తో విడిపోయి ఇంట్లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన తరువాత ఈ విష‌యం త‌న‌కు తెలిసింద‌ని చెప్పారు. అప్ప‌ట్లో తాము అన్యోన్యంగా ఉండేవారమని, త‌మ రిలేష‌న్ చూసి కొంద‌రు కుళ్లుకునేవార‌ని ఆమె వ్యాఖ్యానించింది. 

More Telugu News