Virat Kohli: కోహ్లీ, అనుష్కల పెళ్లి ఇప్పటికే అయిపోయిందా?

  • శనివారమే ఒకటైన కోహ్లీ, అనుష్క
  • త్వరలో వారే ప్రకటిస్తారు
  • ఓ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ట్వీట్

టీమిండియా కెప్టెన్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల వివాహం ఇటలీలోని టస్కనీ నగరంలో జరగబోతున్న సంగతి తెలిసిందే. రేపు జరగనున్న ఈ వివాహ వేడుకకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మరో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది.

విరాట్, అనుష్కల పెళ్లి జరగబోవడం లేదని... వాళ్లిద్దరూ ఇప్పటికే పెళ్లి చేసేసుకున్నారని పేర్కొంటూ ఓ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు. శనివారమే వీరిద్దరూ ఒకటయ్యారని, ఈ విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తారని తెలిపాడు. ఈ వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వార్తలో ఎంత మాత్రం వాస్తవం ఉందనేది తెలియాల్సి ఉంది. 

More Telugu News