nani: ప్రీ రిలీజ్ వేడుకకి సిద్ధమవుతోన్న 'మిడిల్ క్లాస్ అబ్బాయి'

  • 'మిడిల్ క్లాస్ అబ్బాయి'గా నాని 
  • వరంగల్ వేదికగా ప్రీ రిలీజ్ ఫంక్షన్
  • కీలకమైన పాత్రలో భూమిక 
  • ఈ నెల 21వ తేదీన రిలీజ్           

నాని తాజా చిత్రంగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'మిడిల్ క్లాస్ అబ్బాయి' తెరకెక్కింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా, ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా నుంచి ఆడియో వచ్చేసింది .. రేపు సాయంత్రం 6 గంటలకి థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ముహూర్తాన్ని ఖరారు చేసేశారు.

 ఈ నెల 16వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. వరంగల్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. వరంగల్ నేపథ్యంలోనే ఈ కథ కొనసాగుతుంది. అందువలన వరంగల్ లోనే ఈ ఫంక్షన్ ను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, భూమిక కీలకమైన పాత్రను చేసింది. ఈ పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. నటన పరంగా నాని .. సాయిపల్లవి .. భూమిక ముగ్గురూ ముగ్గురే. అలాంటి ఈ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమా, ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.           

More Telugu News