prabhas: 'సాహో'లో అరుణ్ విజయ్ విలన్ కాదట!

  • షూటింగ్ దశలో అరుణ్ విజయ్ 
  • రొటీన్ కి భిన్నమైన పాత్ర 
  • ఈ సినిమాపై ఆశలు 
  • తమిళ .. హిందీ భాషల్లోనూ విడుదల    

ప్రభాస్ హీరోగా .. సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా తెరకెక్కుతోంది. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో అరుణ్ విజయ్ నటిస్తున్నాడు .. 'బ్రూస్ లీ' సినిమాతో ఆయన ఎంతగా ఆకట్టుకున్నాడో తెలిసిందే. తమిళంలోను చాలా వరకూ ఆయన చేసినవి విలన్ పాత్రలే కావడంతో, ఈ సినిమాలోను ఆయన విలన్ గానే నటిస్తున్నాడని అంతా అనుకుంటున్నారు.

అయితే ఈ సినిమాలో ఆయన విలన్ గా కనిపించడట. తాను చేసేది మంచి పాత్రేనని ఆయనే స్వయంగా చెప్పాడు. తాను మంచి స్వభావం కలిగిన వాడిగానే కనిపిస్తాననీ, అయితే ఆ పాత్రను తీర్చిదిద్దిన తీరు డిఫరెంట్ గా ఉంటుందని అన్నాడు. ఈ పాత్ర తనకి మరింత మంచి పేరు తీసుకురావడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.              

More Telugu News