Congress: కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా రాహుల్ గాంధీ ఏక‌గ్రీవ ఎన్నిక‌!

  • ఈ నెల 16న బాధ్య‌త‌లు
  • గాంధీ-నెహ్రూ కుటుంబంలో పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్టిన‌ ఐదో వ్య‌క్తిగా రాహుల్
  • రాజ‌కీయాల్లోకి 2004లో అరంగేట్రం

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ నెల 16న ఆయ‌న‌ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలిగా రాహుల్ గాంధీ త‌ల్లి సోనియా గాంధీ ఉన్న విష‌యం తెలిసిందే. గాంధీ-నెహ్రూ కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్టిన‌ ఐదో వ్య‌క్తిగా రాహుల్ గాంధీ నిలుస్తున్నారు. రాహుల్ గాంధీ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి 2004లో అరంగేట్రం చేశారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన 13 ఏళ్ల త‌రువాత ఆయ‌న అధ్యక్ష పీఠంపై కూర్చుంటున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న అమేథీ నియోజ‌క వ‌ర్గ ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా వున్న విష‌యం తెలిసిందే. 2013 నుంచి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడిగా ఉంటున్నారు.

More Telugu News