బీజేపీ నేత భరత్ రెడ్డి: దళిత యువకులపై నేను దాడి చేశాననేది అవాస్తవం!: బీజేపీ నేత భరత్ రెడ్డి

  • షార్ట్ ఫిల్మ్ లో భాగంగా తీసిన దృశ్యం అది
  • దళిత యువకులను నేను హింసించలేదు..బంధించ లేదు
  • ఓ ఇంటర్వ్యూలో భరత్ రెడ్ి

నిజామాబాద్ జిల్లాలో దళిత యువకులపై దాడి చేసిన సంఘటనలో నిజామాబాద్ బీజేపీ నేత భరత్ రెడ్డిని పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, దళిత యువకులపై తాను దాడి చేసిన మాట అవాస్తవమని అన్నారు. ఇందుకు సంబంధించి సోషల్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వీడియో దృశ్యాలన్నీ ఒక షార్ట్ ఫిల్మ్ లో భాగంగా తీసినవని అన్నారు.

‘షార్ట్  ఫిల్మ్ అయితే, ఘోరమైన పదజాలంతో వారిని ఎందుకు తిడతారు?’ అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ‘మా చుట్టు పక్కల గ్రామాల్లో ఇప్పటికీ దొరల రాజ్యం ఉంది. ఆ గ్రామాల వాతావరణం యావత్తు ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశ్యంతో ఎటువంటి సెన్సార్ లేకుండా చిత్రీకరించా’ అని అన్నారు. ‘ఆ షార్ట్ ఫిల్మ్ పేరేంటి?’ అనే ప్రశ్నకు..‘దొరల రాజ్యం’ అని భరత్ రెడ్డి సమాధానమిచ్చారు.

భయం కారణంగా అలా చెప్పామని దళిత యువకులు నిజామాబాద్ వెళ్లిన తర్వాత అన్నారు గదా? అనే ప్రశ్నకు భరత్ రెడ్డి స్పందిస్తూ, ‘హైదరాబాద్ లో మీడియా ముందు వారు మాట్లాడిన విషయం మీడియా ద్వారానే నాకు తెలిసింది. పోలీసు అధికారులకు ఓ వీడియో స్టేట్ మెంట్ ఇచ్చిన విషయం తెలుసు’ అని అన్నారు. ‘మీ చెరలో ఉన్న దళిత యువకులను ఒక చోట విడిచిపెట్టి, మీరు పోలీసుల ఎదుట లొంగిపోయారట?’ అనే ప్రశ్నకు ..‘ఇదంతా వాస్తవం కాదు’ అని భరత్ రెడ్డి చెప్పారు. తాను మొరం వ్యాపారం చేసే వ్యక్తిని కాదని, తనకు ఎలాంటి దందాలు, టిప్పర్లు లేవని, ఎవరైతే తనపై ఆరోపణలు చేస్తున్నారో వారికే ఉన్నాయని అన్నారు. 

More Telugu News