Allu Arjun: గోవా నుంచి తిరిగి రానున్న బన్నీ

  • గోవాలో 'నా పేరు సూర్య' షూటింగ్
  • ఒక పాట .. ఒక ఫైట్ చిత్రీకరణ
  • రేపటితో షూటింగ్ పూర్తి 
  • విశాల్ - శేఖర్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ  

అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ' నా పేరు సూర్య' రూపొందుతోంది. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, హైదరాబాద్ .. ఊటీ ప్రాంతాల్లో గతంలో షూటింగ్ ను జరుపుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. విలన్ అనూప్ ఠాకూర్ సింగ్ తో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను అక్కడ చిత్రీకరించారు.

ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. అలాగే అల్లు అర్జున్ .. అనూ ఇమ్మాన్యుయేల్ పై ఒక పాటను కూడా చిత్రీకరించారు. గోవాలోని అందమైన లొకేషన్స్ లో ఈ పాట చిత్రీకరణను పూర్తి చేశారు. రేపటితో అక్కడి షెడ్యూల్ పూర్తి కానుంది. కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకుని .. ఆ తరువాత షెడ్యూల్ ను ప్లాన్ చేస్తారట. విశాల్ - శేఖర్ సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.  

More Telugu News