hrithik roshan: నన్ను జైల్లో పెట్టించేందుకు ఒక టాప్ హీరో ప్రయత్నిస్తున్నాడు: కంగనా రనౌత్

  • మరోసారి కంగనా సంచలన వ్యాఖ్యలు
  • హృతిక్ రోషన్ ను ఉద్దేశించి కామెంట్
  • కంగనా, హృతిక్ ల మధ్య కొనసాగుతున్న వివాదం

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. గత కొంత కాలంగా హీరో హృతిక్ రోషన్ ను టార్గెట్ చేసిన కంగనా... మరోసారి ఆయనపై ఆరోపణలు గుప్పించింది. తనను జైల్లో పెట్టించేందుకు ఓ అగ్ర హీరో ప్రయత్నిస్తున్నాడంటూ హృతిక్ ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించింది.

ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, తన చెల్లెలు స్కూల్లో చదువుకునే రోజుల్లో తోటి విద్యార్థి నుంచి యాసిడ్ దాడిని ఎదుర్కొందని చెప్పింది. సినీ రంగంలో కొనసాగుతున్న తనను ఓ స్టార్ హీరో జైల్లో పెట్టించాలని చూస్తున్నాడంటూ ఆరోపించింది. ఇలాంటివన్నీ మన సమాజంలో అత్యంత సహజంగా జరిగిపోతున్నాయని తెలిపింది. కంగనా, హృతిక్ ల మధ్య చాలా కాలంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

More Telugu News