జాతీయ కుటుంబ సర్వే: మద్యం తాగే మహిళల సంఖ్య పెరిగిన జాబితాలో ఏపీ!

  • జాతీయ కుటుంబ సర్వేలో వెల్లడి
  • ఆ జాబితాలో ఢిల్లీ, చండీగఢ్, గోవా, కేరళ, మణిపూర్..
  • మద్యం తాగే పురుషుల శాతం తగ్గగా, పెరిగిన మహిళల శాతం 

మన దేశంలో మద్యం తాగే మహిళల సంఖ్య పెరిగినట్టు జాతీయ కుటుంబ సర్వేలో తాజాగా వెల్లడైంది. ఈ జాబితాలో 9 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉండటం గమనార్హం. సుమారు దశాబ్దకాలం తర్వాత మద్యం తాగే మహిళల సంఖ్య 0.7 శాతానికి పెరగగా, మద్యం సేవించే పురుషుల శాతం 24.7 కు తగ్గినట్టు సర్వేలో వెల్లడైంది. కాగా, 2005-2006 వ సంవత్సరంలో మద్యం సేవించే మహిళల శాతం 0.4గా ఉంది.

2015-2016 నాటికి మద్యం సేవించే మహిళల శాతం 0.7 శాతానికి పెరిగిన రాష్ట్రాల్లో ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, గోవా, కేరళ, మణిపూర్, మిజోరాం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఉన్నట్టు సర్వేలో తేలింది. కాగా, దేశ రాజధాని నగరం ఢిల్లీలో మద్యం సేవించే మహిళలు ‘శక్తి’ పేరిట ప్రత్యేకంగా ఓ గ్రూప్ ను సైతం ఏర్పాటు చేసుకున్నారని సమాచారం. మరో ఆసక్తికరమైన విషయమేంటంటే.. 2005-2006 లో మద్యం సేవించే పురుషుల శాతం 33.1 శాతం.. 2015-2016 నాటికి  24.7 శాతానికి తగ్గడం గమనార్హం. 

More Telugu News