సంగీత విద్వాంసులు సీతారామశర్మ: నట్టువాంగం అందిస్తూ ప్రముఖ సంగీత విద్వాంసులు సీతారామశర్మ కన్నుమూత

  • నిన్న బెంగళూరులో భాగవతుల సీతారామశర్మ మృతి  
  • ఆయన మృతిపై నాట్యాచార్యులు, నృత్యకళాకారులు సంతాపం
  • పలు పురస్కారాలకు దక్కించుకున్న భాగవతుల

ప్రముఖ సంగీత విద్వాంసులు సీతారామశర్మ (81) కన్నుమూశారు. నిన్న బెంగళూరులో ఓ నృత్య రూపకానికి నట్టువాంగం అందిస్తూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై నాట్యాచార్యులు భాగవతుల యజ్ఞనారాయణ శర్మ, వెంకటరామశర్మ, నృత్య కళాకారులు, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

కాగా, కృష్ణాజిల్లా కూచిపూడిలో 1936లో సీతారామశర్మ జన్మించారు. విజయవాడలో నేలి శ్రీరామశర్మ, టిఆర్ సుబ్రహ్మణ్యం వద్ద సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. 1985లో కళాపీఠం స్కూల్ ఆఫ్ డాన్స్ అండ్ మ్యూజిక్ ఇన్ ఇండియా పేరిట శిక్షణా కేంద్రం ప్రారంభించారు. సీతారామశర్మను వరించిన పురస్కారాల గురించి చెప్పాలంటే.. సంగీత నాటక అకాడమీ అవార్డు, మద్రాసు మ్యూజిక్ అకాడమీ నుంచి టీటీకే మెమోరియల్ అవార్డు, ఠాగూర్ అవార్డులు ఆయన దక్కాయి. కంచి కామకోటి పీఠానికి ఆస్థాన విద్వాంసుడిగా కూడా ఆయన వ్యవహరించారు. 

More Telugu News