మంత్రి గంటా: మంత్రి గంటాకు సినిమాటోగ్రఫీ శాఖ కూడా ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నా!: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

  • ‘హలో’ ఆడియో ఫంక్షన్ లో పాల్గొన్న యార్లగడ్డ
  • నాడు చిత్రపరిశ్రమను హైదరాబాద్ కు తీసుకొచ్చింది అక్కినేని 
  • ఆ చిత్ర పరిశ్రమను విశాఖ తీరానికి తీసుకొచ్చేది అఖిలే

ఏపీ ఉన్నత విద్యా శాఖామంత్రి గంటాకు సినిమాటోగ్రఫీ శాఖ కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతున్నానని మాజీ ఎంపీ, ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. విశాఖపట్టణంలో జరుగుతున్న ‘హలో’ ఆడియో వేడుకకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ, మంత్రి గంటా అబ్బాయి కూడా సినిమాల్లో ప్రవేశించాడని అన్నారు. సినిమాటోగ్రఫీ శాఖ కూడా గంటాకు ఇచ్చేస్తే విశాఖకు చిత్ర పరిశ్రమ తిరిగి వస్తుందని భావిస్తున్నానని చెప్పారు.

నాడు మద్రాసు నుంచి చలనచిత్ర పరిశ్రమను హైదరాబాద్ కు తరలించింది అక్కినేని నాగేశ్వరరావు అని, ఆ చిత్ర పరిశ్రమను అక్కడి నుంచి విశాఖ తీరానికి తీసుకొచ్చేది అఖిలేనని ఆయన అనడంతో సభికులు క్లాప్స్ కొట్టారు. అక్కినేనికి, విశాఖ పట్టణానికి చాలా సంబంధం ఉందని, సినిమాల్లో సంపాదన మొదలైన తర్వాత, అరవై ఏళ్ల క్రితం ఆంధ్ర విశ్వ కళాపరిషత్ కు పాతికవేల రూపాయలను అక్కినేని నాగేశ్వరరావు విరాళంగా ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. విద్యా దానం చేసిన కుటుంబం వారిదని, ఆంధ్రా యూనివర్శిటీ సెనేట్ లో అక్కినేని నాగేశ్వరరావు శాశ్వత సభ్యుడని అన్నారు. నాగార్జున ‘హలోబ్రదర్’ చిత్రం లాగా, అఖిల్ ‘హలో’ చిత్రం కూడా మంచి హిట్ సాధించాలని యార్లగడ్డ ఆకాంక్షించారు.

More Telugu News