India: ఆరో వికెట్ కూడా డౌన్ ... నాటి చెత్త రికార్డును బ్రేక్ చేస్తారా ఏంటి.... క్రికెట్ పై సోషల్ మీడియా!

  • 2000 సంవత్సరంలో చెత్త పరుగుల రికార్డు
  • నాడు 54 పరుగులకే ఆలౌటైన టీమిండియా
  • అప్పుడు కూడా ప్రత్యర్థి శ్రీలంకే
  • నాటి రోజులు గుర్తుకు తెస్తున్న ధర్మశాల మ్యాచ్

భారత్ తరఫున అత్యంత తక్కువ పరుగులు చేసిన వన్డే మ్యాచ్ రికార్డును నేటి రోహిత్ సేన బద్దలు కొడుతుందా? నేడు ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్ ని చూస్తుంటే అలానే అనిపిస్తోంది. గింగిరాలు తిరుగుతూ వస్తున్న బంతులను ఎదుర్కోవడంతో ప్రధాన బ్యాట్స్ మెన్స్ అంతా విఫలం కాగా, ధోనీ ఒక్కడు క్రీజలో ఉన్నాడు. అతనికి తోడుగా బౌలర్లు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం భారత స్కోరు 29 పరుగులకు ఆరు వికెట్లు కాగా, ధోనీ, భువనేశ్వర్ క్రీజులో ఉన్నారు. ఇక భారత టీమ్ వరకూ చూస్తే, 2000 సంవత్సరంలో శ్రీలంక జట్టుపైనే 54 పరుగుల అత్యల్ప స్కోరుకు జట్టు ఆలౌటైంది.

షార్జాలో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లంక, 299 పరుగులు చేయగా, భారత జట్టులో ఆర్పీ సింగ్ మినహా మరెవరూ రెండంకెల స్కోరు చేయలేదు. గంగూలీ 3, టెండూల్కర్ 5, యువరాజ్ 3, కాంబ్లీ 3, బదానీ 9, సింగ్ 11, దహియా 4, జోషి 4, అగార్కర్ 2, జహీర్ ఖాన్ 1, బీకేవీ ప్రసాద్ 3 పరుగులు చేశారు. ఆ మ్యాచ్ లోని వరస్ట్ రికార్డు నేడు గుర్తుకు వస్తోంది. మరో 25 పరుగులకు స్కోర్ బోర్డుకు కలపకుండా అందరూ వెనుదిరిగితే, నాటి చెత్త రికార్డు స్థానంలో మరో చెత్త రికార్డు వచ్చి చేరుతుంది.

More Telugu News