Gold: 12 రోజుల్లో రూ. 1,500 తగ్గిన బంగారం ధర!

  • ఫిబ్రవరి వరకూ శుభకార్యాలు లేవు
  • బంగారం కొనుగోలుకు తగ్గిన డిమాండ్
  • ఈక్విటీ మార్కెట్ వైపు పెట్టుబడులు

ప్రస్తుతం శుభకార్యాలేవీ లేకపోవడం, అంతర్జాతీయంగా తగ్గుతున్న ధరలు బంగారాన్ని కిందకు తెస్తున్నాయి. గడచిన 12 రోజుల్లో భాగారం ధర రూ. 1,500కు పైగా తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 27,310 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 29,190గా ఉంది. స్టాక్ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతుండటంతో బులియన్ మార్కెట్ నుంచి పెట్టుబడులు ఈక్విటీల వైపు తరలుతున్నాయని, అందువల్లే ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

ఇక ఫిబ్రవరి 19 వరకూ ఇండియాలో సుముహూర్తాలు లేకపోవడంతో, కొనుగోళ్లు సాగడం లేదని, డిమాండ్ తగ్గడానికి అది కూడా ఓ కారణమని తెలిపారు. కాగా, సమీప భవిష్యత్తులో సైతం బంగారం ధరలో మరికొంత కరెక్షన్ జరుగుతుందని బులియన్ ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు.

More Telugu News