Vijay Malya: ఉచ్చు బిగుస్తోంది... బ్రిటన్ లో మాల్యా ఆస్తుల సీజ్... వారానికి రూ. 4 లక్షలే ఇవ్వాలన్న కోర్టు!

  • మరో మెట్టెక్కిన సీబీఐ, ఈడీ ప్రయత్నాలు
  • బ్యాంకు ఖాతాల లావాదేవీలూ నిలిపివేత
  • దేశం విడవరాదని ఆదేశాలు
  • ఏకధాటిగా జరుగుతున్న విచారణ

ఇండియాలో బ్యాంకుల నుంచి తీసుకున్న వేల కోట్ల రుణాన్ని ఎగ్గొట్టి, ఆపై బ్రిటన్ కు పారిపోయిన విజయ్ మాల్యాను ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని సీబీఐ, ఈడీ చేస్తున్న ప్రయత్నాలు మరో మెట్టెక్కాయి. మాల్యా అవినీతిని గురించి సీబీఐ, ఈడీ వాదనలు విన్న వెస్ట్ మినిస్టర్స్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

బ్రిటన్ లోని మాల్యా ఆస్తులను స్తంభింపజేసిన న్యాయస్థానం, బ్యాంకు ఖాతాల లావాదేవీలనూ నిలిపివేసింది. తన ఖర్చుల నిమిత్తం మాల్యాకు వారానికి రూ. 4 లక్షలు మాత్రమే ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ ఆయన దేశం విడిచి వెళ్లరాదని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. మాల్యా అప్పగింత కేసు విచారణ ఏకధాటిగా సాగుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఆయన ఆస్తులను స్తంభింపజేయాలని చానాళ్ల క్రితమే సీబీఐ, ఈడీ బ్రిటన్ ను కోరగా, అప్పట్లో అంగీకరించలేదన్న సంగతి తెలిసిందే.

More Telugu News