arjun kapoor: తన మీద దాడి జరిగిందంటూ వచ్చిన వార్తలపై మండిపడ్డ బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్

  • చిన్న గొడ‌వ‌ను పెద్ద‌దానిగా సృష్టించార‌ని వ్యాఖ్య‌
  • త‌న కుటుంబ స‌భ్యులు బాధ‌ప‌డ్డార‌న్న న‌టుడు
  • ట్వీట్‌లో మీడియా సంస్థ‌పై అసంతృప్తి

బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు అర్జున్ క‌పూర్ `సందీప్ అండ్ పింకీ ఫ‌రార్‌` షూటింగ్‌లో ఉండ‌గా ఓ వ్య‌క్తి అత‌ని మీద దాడి చేసి, తీవ్రంగా గాయ‌ప‌రిచాడ‌ని, పోలీసులు స‌ద‌రు వ్య‌క్తిని అరెస్టు చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ను ప్ర‌ముఖ వెబ్‌సైట్లు కూడా పెద్ద పెద్ద ప‌దాలు వాడి ప్ర‌చురించ‌డంతో త‌న కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న చెందార‌ని అర్జున్ క‌పూర్ తెలిపారు.

నిజానికి షూటింగ్ సెట్‌లో జ‌రిగిన చిన్న అల్ల‌రిని, వెబ్‌సైట్ మీద ప్ర‌భావం ప‌డ‌టం కోసం దాడి, గాయాలు వంటి పెద్ద పెద్ద ప‌దాలు ఉప‌యోగించ‌డం స‌బబుకాద‌ని అర్జున్ హిత‌వు ప‌లికారు. ఈ మేర‌కు ఆయ‌న సంబంధిత వెబ్‌సైట్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. వార్త రాసే ముందు సంఘ‌ట‌న గురించి కొంచెం ప‌రిశోధించి రాయాల‌ని సూచించారు.

More Telugu News