nani: ఆకట్టుకుంటోన్న 'మిడిల్ క్లాస్ అబ్బాయి' న్యూ పోస్టర్స్

  • 'మిడిల్ క్లాస్ అబ్బాయి'గా నాని 
  • వదిన పాత్రలో భూమిక 
  • ఆమె పాత్ర ప్రత్యేక ఆకర్షణ 
  • ఈ నెల 15వ తేదీన విడుదల     

నాని అభిమానులంతా 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమాలో భూమిక ఒక కీలకమైను పాత్రను పోషించింది. ఈ సినిమాలో ఆమె ఆర్టీఏ అధికారిగా .. నానికి వదిన పాత్రలో కనిపించనుంది. ఇక నాని మాత్రం పనీ పాటా లేకుండా గాలికి తిరుగుతూ ఉంటాడట. దాంతో ఈ ఇద్దరికీ ఒక్క నిమిషం కూడా పడదట. అలాంటి పరిస్థితుల్లో వదిన ఒక సమస్యలో చిక్కుకుంటే .. ప్రాణాలకి తెగించి నాని ఆ సమస్యను ఎలా పరిష్కరించాడనేదే కీలకమైన అంశమట. ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో భూమిక లుక్ ను రివీల్ చేస్తూ .. ఆమె కాంబినేషన్లోని కొత్త పోస్టర్స్ ను వదిలారు. ఈ పోస్టర్స్ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా వున్నాయి. భూమిక పాత్ర ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.     

More Telugu News