aadhaar: మన 'ఆధార్' ఎక్క‌డ‌, ఎప్పుడు వాడోమో ఇలా తెలుసుకోవచ్చు!

  • ఆధార్ దుర్వినియోగం అవుతుందన్న భయం లేదు 
  • దుర్వినియోగం అవుతుంద‌న్న భ‌యం వ‌ద్దు
  • అవ‌కాశాన్ని క‌ల్పించిన యూఏడీఏఐ

అన్నింటికీ ఆధార్‌...అనే విధానం వ‌చ్చిన నాటి నుంచి ఆధార్ కార్డును ఎన్ని చోట్ల వాడి ఉంటామో లెక్క తెలియ‌కుండా పోయింది. దీంతో ముఖ్య‌మైన వివ‌రాల‌ను ఎక్క‌డ దుర్వినియోగం చేస్తార‌నే భ‌యం ప‌ట్టుకుంది. ఇక ఆ ఆందోళ‌న అవ‌స‌రం లేదు. ఎందుకంటే... ఒక వ్య‌క్తి త‌న ఆధార్ కార్డును ఎప్పుడు, ఎక్క‌డ వాడాడ‌నే విష‌యాల‌ను తెలుసుకునేందుకు ఆధార్ సంస్థ యూఏడీఏఐ ఓ పోర్ట‌ల్‌ను ప్రారంభించింది.

https://resident.uidai.gov.in/notification-aadhaar లింక్‌కి వెళ్లి అక్క‌డ ఆధార్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేసి, రిజిస్ట‌ర్డ్‌ మొబైల్ నంబ‌ర్‌కి వ‌చ్చే వ‌న్ టైమ్ పాస్‌వ‌ర్డ్‌ ద్వారా వెరిఫికేష‌న్ చేయాలి. తర్వాతి పేజీలో ఎలాంటి సమాచారం కావాలో కోరుతూ కొన్ని ఆప్షన్స్ వ‌స్తాయి. వాటిని ఎంపిక చేయ‌డం ద్వారా ఆధార్ వాడిన విధానం, ప్ర‌దేశం గురించి తెలుసుకోవ‌చ్చు. ప్రస్తుత తేదీ నుంచి గరిష్ఠంగా ఆరు నెలల కిందటి వరకు ఆధార్‌ను ఎలా ఎక్కడ వాడారో తెలుసుకోవచ్చు. అయితే ఇందులో ఆధార్ వాడిన కంపెనీ లేదా ఏజెన్సీ పేర్లు మాత్రం చూపించదు.

More Telugu News