sumanth: 'మ‌ళ్లీ రావా' సినిమా ప్రింట్ కావాలంటూ, సీఎం కేసీఆర్ కుటుంబం నుంచి మెసేజ్ వ‌చ్చింది!: సినీ హీరో సుమంత్

  • 'మ‌ళ్లీ రావా' సినిమాకు వ‌స్తోన్న స్పంద‌న‌పై సుమంత్ హ‌ర్షం
  • ఈ సినిమా ప్రింట్ కావాల‌ని కేసీఆర్ కుటుంబం అడిగింది
  • పంపుతున్నాను..

తాను హీరోగా గౌతమ్‌ తిన్నసూరి దర్శకత్వంలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిత్రం 'మళ్లీరావా'కు మంచి స్పంద‌న వ‌స్తోంద‌ని సుమంత్ హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాడు. 'తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుటుంబం నుంచి ఇప్పుడే ఓ మెసేజ్ వ‌చ్చింది. ఈ సినిమా ప్రింట్‌ను పంపించ‌మ‌ని కోరారు. పంపుతున్నాను' అని సుమంత్ ఈ రోజు త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలుపుతూ హ‌ర్షం వ్య‌క్తం చేశాడు. ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్‌ సుమంత్‌కి జోడీగా నటించింది. కాగా, ఈ సినిమా చాలా బాగుంద‌ని యువ‌న‌టుడు సుధీర్ బాబు ట్వీట్ చేశాడు. సుధీర్‌కి థ్యాంక్స్ చెబుతూ ఆ ట్వీట్‌ను సుమంత్ రీ ట్వీట్ చేశాడు. 

More Telugu News