srivishnu: 'నీది నాదీ ఒకే కథ' మోషన్ టీజర్ రిలీజ్ కి అనూహ్యమైన రెస్పాన్స్

  • శ్రీ విష్ణు తాజా చిత్రంగా 'నీది నాదీ ఒకే కథ'
  • డిఫరెంట్ కంటెంట్ తో కూడిన చిత్రం 
  • త్వరలోనే టీజర్ .. ఆడియో రిలీజ్    

వైవిధ్యభరితమైన కథలకు .. పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ శ్రీవిష్ణు ముందుకు వెళుతున్నాడు. 'అప్పట్లో ఒకడుండేవాడు' .. 'ఉన్నది ఒకటే జిందగీ' .. 'మెంటల్ మదిలో' సినిమాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.  శ్రీవిష్ణు సినిమాల్లో విషయం ఉంటుంది అనే నమ్మకం ప్రేక్షకులకి కలగడంతో, ఆయన తన తదుపరి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు.

 ఈ క్రమంలోనే ఆయన 'నీది నాదీ ఒకే కథ' సినిమా చేస్తున్నాడు. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి, తాజాగా మోషన్ టీజర్ ను రిలీజ్ చేశారు. డిఫరెంట్ గా అనిపిస్తోన్న ఈ మోషన్ టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. కంటెంట్ లో ఏదో కొత్తదనం ఉందనే విషయం అర్థం కావడంతో, అందరిలో ఆసక్తి మొదలైంది. త్వరలోనే టీజర్ ను .. ఆడియోను కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా శ్రీవిష్ణు కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

More Telugu News