Rashi khanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • మరో తమిళ చిత్రంలో రాశిఖన్నా 
  • అఖిల్ 'హలో' షూటింగ్ పూర్తి 
  • మంజుల సినిమా 'మనసుకు నచ్చింది'
  • నాని సినిమాలో భూమిక కీలక పాత్ర

*  తెలుగులో బిజీగా సినిమాలు చేస్తున్న అందాలతార రాశిఖన్నా తాజాగా తమిళంలో ఓ అవకాశాన్ని అందుకుంది. కార్తీక్ తంగవేలు దర్శకత్వంలో జయం రవి హీరోగా రూపొందే చిత్రంలో రాశి కథానాయికగా ఎంపికైంది. ఇప్పటికే తమిళంలో సిద్ధార్థ్ సరసన ఈ ముద్దుగుమ్మ మరో చిత్రంలో నటిస్తోన్న సంగతి విదితమే.
*  అఖిల్ అక్కినేని హీరోగా విక్రం కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'హలో' చిత్రం షూటింగ్ కార్యక్రమాలన్నీ నిన్నటితో పూర్తయ్యాయి. కాగా, ఈ చిత్రం ఆడియో వేడుకను ఈ నెల 10న విశాఖపట్నంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.
*  సూపర్ స్టార్ కృష్ణ తనయ మంజుల ఘట్టమనేని తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి 'మనసుకు నచ్చింది' అనే టైటిల్ని ఖరారు చేశారు. సందీప్ కిషన్, అమైరా దస్తర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
*  నాని హీరోగా వేణు శ్రీరాం దర్శకత్వంలో రూపొందిన 'ఎంసీఏ' (మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రంలో నిన్నటి తరం నాయిక భూమిక కీలక పాత్ర పోషించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. ఈ నెల 21న ఈ చిత్రం విడుదల కానుంది.    

More Telugu News