rangasthalam 1985: 'రంగ‌స్థ‌లం 1985' ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల రేపు కాదు ఎల్లుండి!

  • మొద‌ట శుక్ర‌వారం విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించిన సినిమా యూనిట్‌
  • తాజాగా శ‌నివారం ఉద‌యం 9 గంట‌ల‌కు అని ప్ర‌క‌ట‌న‌
  • రామ్‌చ‌ర‌ణ్ తేజ్‌, స‌మంత‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో 'రంగ‌స్థ‌లం 1985'

మెగాహీరో రామ్‌చ‌ర‌ణ్ తేజ్‌, స‌మంత‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటోన్న‌ 'రంగ‌స్థలం 1985' చిత్రం ఫ‌స్ట్‌లుక్ రేపు సాయంత్రం 5:30కి విడుద‌ల చేస్తామ‌ని ఆ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. అయితే, అనూహ్యంగా ఆ ఫస్ట్‌లుక్‌ రిలీజ్ ను మరి కొన్ని గంట‌ల‌పాటు వాయిదా వేశారు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను రేపు కాకుండా ఎల్లుండి (డిసెంబరు 9న‌) ఉదయం 9గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది మార్చిలో విడుదల చేయనున్నారు. ఇందులో హాట్ యాంక‌ర్ అన‌సూయ కూడా ఓ పాత్ర‌లో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే.
                                        (సినీ బృందం మొద‌ట చేసిన ప్ర‌క‌ట‌న)
        

More Telugu News