charan: 'రంగస్థలం' రిలీజ్ డేట్ పై పెరుగుతోన్న ఆసక్తి!

  • మార్చి 29న 'రంగస్థలం' రిలీజ్ అవుతుందన్న ప్రచారం 
  • అదే రోజున వస్తోన్న 'మహానటి' 
  • ఆ రోజున 'రంగస్థలం' రిలీజ్ పై సందేహాలు 

సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'రంగస్థలం 1985' .. ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. చరణ్ .. సమంత ప్రధానమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాను మార్చి 29వ తేదీన విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఇదే రోజున తమ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా తాజాగా 'మహానటి' టీమ్ ప్రకటించింది. దాంతో ఆ రోజున 'రంగస్థలం' విడుదల కాకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది.

'రంగస్థలం' రావడం లేదు కనుకనే ఆ రోజున 'మహానటి'ని థియేటర్స్ కి తెస్తున్నారని చెప్పుకుంటున్నారు. 'రంగస్థలం' వస్తే .. 'మహానటి' కంటే ముందుగానే రావలసి ఉంటుంది. లేదంటే ఏప్రిల్ ఫస్టు వీక్ లో రావలసి ఉంటుంది. ఆ తరువాత '2.0' .. 'భరత్ అనే నేను' .. ' నా పేరు సూర్య' రిలీజ్ కి వున్న సంగతి తెలిసిందే. ఇక పిల్లలకి పరీక్షలు అయిన తరువాత రిలీజ్ చేయడమే బెటర్ అనే ఆలోచన వస్తే మాత్రం, ఈ సినిమా మే నెలకి వెళ్లడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.          

More Telugu News