గతంలోని సక్సెస్ లను తలచుకుంటూ నేనేమీ భ్రమలో బ్రతకడం లేదు: ఆర్పీ పట్నాయక్

07-12-2017 Thu 12:45
  • సక్సెస్ లు వున్నప్పుడు నేను ఆ ఇది చూపించలేదు 
  • ఇప్పుడు కూడా అలాగే వున్నాను
  •  ఇక ముందు కూడా అలాగే వుంటాను  
'నువ్వు నేను' .. 'మనసంతా నువ్వే' సినిమాలు చేసినప్పటి క్రేజ్ ను ఇప్పటికీ ఊహించుకుంటూ, ఆర్పీ పట్నాయక్ భ్రమలో బ్రతుకుతూ వుంటారనే టాక్ వుంది. ఇంకా తాను ఆ రేంజ్ లో ఉన్నాననే ఫీలవుతుంటారు అని కొందరు కామెంట్ చేస్తుంటారు. ఈ విషయంపై మీరెలా స్పందిస్తారు?" అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆర్పీ పట్నాయక్ కి ఎదురైంది.

అప్పుడాయన తనదైన శైలిలో స్పందిస్తూ .. " అలా ఆలోచించడం వాళ్ల భ్రమ .. నేను ఒక్కటే చెబుతా .. నా చిన్ననాటి స్నేహితులు .. అంటే నేను నిక్కరు వేసుకున్నప్పుడు నాతో పాటు తిరిగిన ఫ్రెండ్స్ వున్నారు. ఈ రోజున కలిసినా 'ఏంట్రా నువ్వేం మారలేదు' అనే అంటారు. సక్సెస్ లు వున్నప్పుడు కూడా నేను ఆ ఇది ఎప్పుడూ చూపించలేదు. అప్పుడు ఎలా ఉన్నానో .. ఇప్పుడు అలాగే వున్నాను .. ఇక ముందు కూడా ఇలాగే వుంటాను" అని చెప్పుకొచ్చారు.