Revanth Reddy: 'గులాబీ కూలీ' విషయంలో రేవంత్ రెడ్డి ఫిర్యాదుపై ఏం చేశారు?: ఏసీబీకి హైకోర్టు నోటీసులు

  • పరిశ్రమలు, వ్యక్తుల నుంచి డబ్బు తీసుకున్న మంత్రులు
  • 'గులాబీ కూలీ' పేరిట దండుకున్నారన్న రేవంత్
  • ఫిర్యాదు చేసినా, మూడు నెలలుగా చర్యలు లేవని కోర్టుకు తెలిపిన రేవంత్

'గులాబీ కూలీ' అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు, కీలక నాయకులు వివిధ సంస్థలు, పరిశ్రమలు, వ్యక్తల వద్ద లక్షల రూపాయలు వసూలు చేశారని మాజీ టీడీపీ నేత, ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ, తెలంగాణ ఏసీబీని తెలుగు రాష్ట్రాల హైకోర్టు ఆదేశించింది.

ఈ సంవత్సరం ఆగస్టు 31న రేవంత్ రెడ్డి, గులాబీ కూలీపై ఏసీబీకి ఫిర్యాదు ఇవ్వగా, దానిపై ఇంతవరకూ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఇదే విషయాన్ని రేవంత్, హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7, 11, 13 ప్రకారం మంత్రులు చేసిన పని అవినీతి కిందకే వస్తుందని ఆయన ఆరోపించారు. ఇక ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను, ఇప్పటివరకూ జరిగిన విచారణ నివేదికను డిసెంబర్ 13న సమర్పించాలని హైకోర్టు ఏసీబీని ఆదేశించింది.

More Telugu News