Allu Arjun: కోటి రూపాయలు పెట్టి కథ కొనేసిన బన్నీ?

  • కొత్త కథలపై దృష్టి పెట్టిన బన్నీ 
  • కొత్త దర్శకులకు ఛాన్స్ ఇచ్చే ఆలోచన
  • కంటెంట్ కే మొదటి ప్రాధాన్యత  

బన్నీ ఇదివరకటిలా స్టార్ డైరెక్టర్ ల తోనే సినిమాలు చేయాలనే ఉద్దేశంతో వెయిట్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. కథలో కొత్తదనం ఉండాలే గానీ, కొత్త దర్శకులతో చేయడానికి కూడా ఆయన సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఆయన సంతోష్ రెడ్డి అనే కొత్త దర్శకుడితో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.

 ఇక తాజాగా మరో దర్శకుడు కథ వినిపించడంతో .. కోటి రూపాయలు చెల్లించి ఆ కథను సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో అని కన్నెగంటి అనే దర్శకుడు మంచు మనోజ్ తో 'మిస్టర్ నూకయ్య' అనే సినిమాను తెరకెక్కించాడు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఈ దర్శకుడు ఇటీవల బన్నీని కలిసి ఒక కథ వినిపించగా, ఆ కథ బాగా నచ్చేయడంతో బన్నీ కొనేశాడట. అయితే ఈ సినిమాను తాను చేయాలనే ఉద్దేశంతో తీసుకున్నాడా? లేదంటే అల్లు శిరీష్ కోసం కొన్నాడా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది.         

More Telugu News