PV Sindhu: పి.వి.సింధుకు ఉప కలెక్టర్‌ హోదాలో జీతం ఖరారు!

  • రెవెన్యూ విభాగంలో సింధుకు ఉపకలెక్టర్ హోదా ఉద్యోగం 
  •  సింధుకు జీతం ఖరారు చేసిన ప్రభుత్వం 
  • 40270-93780 రూపాయలుగా ఖరారు  

ఒలింపిక్ రజతపతక విజేత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు జీతాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఒలింపిక్ పతకసాధన అనంతరం ఆమెకు ఉప కలెక్టర్‌ హోదా ఉద్యోగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో రెవెన్యూ విభాగంలో ఆమె కోసం సూపర్ న్యూమరీ పోస్టును ప్రభుత్వం క్రియేట్ చేసింది. దీంతో సింధు విధుల్లో కూడా చేరింది. తాజాగా ఆమె జీతాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. ఆమెకు రూ.40270-93780 పే స్కేల్‌ ను ఇవ్వనున్నట్టు నిర్ణయించింది. ఈమేరకు రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా, సింధు భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ పరిధిలో ఉప కలెక్టర్‌గా 72 వారాలపాటు శిక్షణ పొందాల్సి ఉంటుంది. అయితే ఆమెకు ప్రత్యేక అనుమతి మంజూరు చేస్తూ మరొక ఉత్తర్వు జారీ చేశారు. ఈ ఉత్తర్వు ద్వారా వివిధ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ పోటీలకు హాజరయ్యేందుకు, గోపీచంద్‌ అకాడెమీలో శిక్షణ పొందేందుకు వీలు కల్పించారు. 

More Telugu News