మరో రెండు.. వైరల్ అవుతున్న హార్ధిక్ పటేల్ సెక్స్ టేపులు!

07-12-2017 Thu 09:13
  • వెలుగులోకి మరో రెండు వీడియోలు
  • బీజేపీ మార్ఫింగ్ చేసిందన్న ‘పాస్’
  • వీటిని ప్రసారం చేయవద్దంటూ మీడియాకు వేడుకోలు
గుజరాత్ ఎన్నికల వేడి బాగా రాజుకున్న వేళ పటీదార్ రిజర్వేషన్ ఉద్యమ నేత హార్థిక్ పటేల్‌కు చెందిన మరో రెండు వీడియోలు వైరల్ అయ్యాయి. ఓ మహిళతో హార్ధిక్ సన్నిహితంగా ఉన్న ఈ వీడియోలు బుధవారం వెలుగులోకి వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.  తాజాగా వెలుగు చూసిన వీడియో మూడోది కావడం గమనార్హం. గత నెలలో రెండు సెట్ల వీడియోలు వైరల్ కాగా, తాజా సెట్ వీడియోలు నిమిషాల వ్యవధిలోనే వైరల్ అయ్యాయి.

మహిళతో తాను ఏకాంతంగా ఉన్న వీడియోలను బీజేపీ విడుదల చేసే అవకాశం ఉందని, గుజరాత్ ఎన్నికల ముందు బీజేపీ ఆ పనిచేస్తుందని హార్ధిక్ గతంలో చెప్పారు. అంతేకాదు, ఇటువంటివి మరిన్ని వీడియోలను విడుదల చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అప్పట్లో హార్ధిక్ పేర్కొన్నారు. అయితే తాజా వీడియోలపై స్పందించేందుకు హార్ధిక్ అందుబాటులోకి రాలేదు.

తాజా వీడియోలు గతంలో విడుదల చేసి వాటికి కొనసాగింపుగా ఉన్నాయి. వీటిలో హార్ధిక్ మరో ఇద్దరితో కలిసి ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నారు. గదిలో లైట్లు ఆపేసిన తర్వాత మిగతా ఇద్దరూ బయటకు వెళ్లిపోగా హార్ధిక్ ఒక్కడే లోపల ఉన్నాడు. తాజా వీడియోపై పటీదార్ అనామత్ ఆందోళన సమితి కో కన్వీనర్ దినేశ్ బంభానియా మాట్లాడుతూ ఇది డాక్టరింగ్ (మార్ఫింగ్) చేసిన వీడియో అని పేర్కొన్నారు. ఈ వీడియోల్లో ఉన్నది అవాస్తవమని తాము పదపదే చెబుతున్నామని, బీజేపీనే వీటిని డాక్టరింగ్ చేసిందని ఆరోపించారు. వీడియోలను ప్రసారం చేయవద్దని మీడియోను కోరారు.