samsung: 512 జీబీ మెమొరీ చిప్‌ ఉత్ప‌త్తి ప్రారంభించిన శాంసంగ్ కంపెనీ

  • వెల్ల‌డించిన శాంసంగ్ ఎల‌క్ట్రానిక్స్‌
  • నెక్స్ట్ జ‌న‌రేష‌న్ స్మార్ట్‌ఫోన్ల కోసమేన‌ని వ్యాఖ్య‌
  • ప‌నిత‌నంలో కూడా మెరుగ్గా ఉంటుంద‌ని భ‌రోసా

వ‌చ్చే త‌రం స్మార్ట్‌ఫోన్ల కోసం ప్ర‌త్యేకంగా 512 జీబీ ఉన్న మెమొరీ చిప్‌ల ఉత్ప‌త్తిని శాంసంగ్ కంపెనీ ప్రారంభించింది. ఈ మేర‌కు శాంసంగ్ ఎల‌క్ట్రానిక్స్ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. మైక్రో ఎస్‌డీ కార్డుల్లో సాధార‌ణంగా త‌లెత్తే ప‌ర్‌ఫార్మెన్స్ స‌మ‌స్య‌లను కూడా ఈ కొత్త చిప్‌లు అధిగ‌మిస్తాయ‌ని శాంసంగ్ ప్ర‌తినిధులు తెలిపారు.

ఈ మెమొరీ చిప్‌ల‌కు త‌గ్గ‌ట్లుగానే త్వ‌ర‌లోనే హై ఎండ్ స్మార్ట్‌ఫోన్ల త‌యారీని కూడా తాము చేప‌ట్ట‌నున్న‌ట్లు శాంసంగ్ ఎల‌క్ట్రానిక్స్ ప్ర‌క‌టించింది. ఈ మెమొరీ చిప్‌ల పనిత‌నం కూడా చాలా మెరుగ్గా ఉంటుంద‌ని ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

More Telugu News