Adithyan: తమిళ సినీ సంగీత దర్శకుడు ఆదిత్యన్ మృతి!

  • త‌న కూతురిని చూడడానికి హైద‌రాబాద్ వ‌చ్చిన ఆదిత్య‌న్‌
  • కిడ్నీ ఫెయిల్యూర్ కార‌ణంగా ఒక్క‌సారిగా కుప్ప‌కూలిన సంగీత ద‌ర్శ‌కుడు
  • రేపు చెన్నైలో అంత్యక్రియలు

అనారోగ్యంతో బాధ‌ప‌డుతోన్న ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు ఆదిత్యన్‌ (63) నిన్న రాత్రి మృతి చెందారు. త‌న కూతురిని చూడటానికి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ఆదిత్య‌న్ ఒక్క‌సారిగా కుప్పకూలిపోయి చ‌నిపోయారు. ఆయ‌న‌కు కిడ్నీ ఫెయిల్యూర్ అయింద‌ని తెలిసింది. ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణంపై సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. రేపు చెన్నైలో ఆయ‌న‌ అంత్యక్రియలను నిర‍్వహిస్తారు.

ఆదిత్య‌న్‌ తమిళం, మలయాళం, తెలుగు సినిమాలకు సంగీతాన్ని అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. పలు తమిళ పాప్‌, రీమిక్స్‌ ఆల్బమ్స్ ను ఆయ‌న రూపొందించారు. సీవల్‌ పేరి పాండి, నాయ‌ల సైది వంటి సినిమాల‌కు ఆయ‌న అందించిన సంగీతం ప్ల‌స్ పాయింట్ గా నిలిచింది.

More Telugu News