great britain: డౌనింగ్ స్ట్రీట్ గేట్లు పేల్చేసి.. ప్రధానిని హతమార్చాలని ప్రణాళిక రచించిన ఉగ్రవాదుల అరెస్టు!

  • బ్రిటన్ ప్రధాని థెరెసా మేను హతమార్చాలని ప్రణాళిక 
  • ముందు నివాసం గేట్లు పేల్చి లోపలికెళ్లి ప్రధానిని హతమార్చాలని ప్లాన్
  • కుట్ర భగ్నం..ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు


బ్రిటన్ ప్రధాని థెరెసా మేను హతమార్చాలని ప్రణాళిక రచించిన ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుని భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేసిన ఘటన లండన్ లో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... ఉత్తర లండన్ కు చెందిన నైముర్ జకారియా రెహ్మాన్ (20), వాయవ్య బర్మింగ్ హామ్ కి చెందిన మహ్మద్ అకిబ్ ఇమ్రాన్ (21)లు బ్రిటన్‌ ప్రధాని అధికారిక నివాసమైన డౌనింగ్ స్ట్రీట్ గేట్లు పేల్చివేసి, భద్రతా సిబ్బంది ఆ గందరగోళంలో ఉండగా, భవనంలో ప్రవేశించి ప్రధాని థెరెసా మేను హతమార్చాలని ప్రణాళిక రచించారు. వారి కుట్రను భగ్నం చేసిన బ్రిటన్ భద్రతా దళాలు వారిని అదుపులోకి తీసుకుని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపరిచారు. 

More Telugu News