Australia: విచిత్రం! మూడు బంతుల్లోనే మొత్తం రివ్యూలను కోల్పోయిన ఆస్ట్రేలియా!

  • యాషెస్ సిరీస్‌లో ఘటన
  • మూడు బంతుల వ్యవధిలో రెండు రివ్యూలను కోల్పోయిన ఆసీస్
  • క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి 

ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా విచిత్ర  పరిస్థితిని ఎదుర్కొంది. కేవలం మూడు బంతుల తేడాలో రెండు రివ్యూలను కోల్పోయింది. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ విషయంలో తొలి రివ్యూను కోల్పోయిన ఆసీస్, డేవిడ్ మాలన్ విషయంలో రెండోసారి తప్పులో కాలేసి రివ్యూను కోల్పోయింది. గతంలో ప్రతీ 80 ఓవర్లకు రెండు రివ్యూలును ఇచ్చేలా నిబంధనలు ఉండగా, ప్రస్తుతం మొత్తం మ్యాచ్‌లో రెండే రివ్యూలు ఉండడం ఆసీస్‌ను దెబ్బతీసింది. కేవలం మూడు బంతుల్లోనూ రెండింటినీ కోల్పోయింది. క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.

జో రూట్ ఇచ్చిన క్యాచ్ బిహైండ్ విషయంలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అప్పీల్‌ను న్యూజిలాండ్ అంపైర్ క్రిస్ గాఫెనీ తిరస్కరించడంతో స్మిత్ రివ్యూ కోరాడు. అయితే రివ్యూలో అది ఔట్ కాదని తేలడంతో ఆసీస్ తొలి రివ్యూను కోల్పోయింది. మరో రెండు బంతుల తర్వాత డేవిడ్ మాలిన్ విషయంలో మరోసారి స్మిత్ రివ్యూ కోరగా అది కూడా ఔట్ కాదని తేలింది. దీంతో మూడు బంతుల వ్యవధిలోనే ఉన్న రెండు రివ్యూలను కోల్పోయింది.

More Telugu News