bbc news: బీబీసీ న్యూస్‌ ఘోర త‌ప్పిదం... శ‌శిక‌పూర్ మ‌ర‌ణ‌ వార్త‌కి అమితాబ్‌, రిషి క‌పూర్‌ల వీడియో

  • వైర‌ల్ అవుతున్న వీడియో
  • దుమ్ము దులిపేస్తున్న నెటిజ‌న్లు
  • క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ ట్వీట్లు

బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు శ‌శిక‌పూర్ నిన్న మ‌ర‌ణించిన బాధ‌లో ప్ర‌ముఖులు, అభిమానులు ఆయ‌న‌కు నివాళి అర్పిస్తూ ట్వీట్లు చేశారు. వార్తా ఛాన‌ళ్లు కూడా పలు స్టోరీలు చేశాయి. అయితే ప్ర‌ముఖ ఇంగ్లిష్ న్యూస్ ఛాన‌ల్ 'బీబీసీ న్యూస్' ఈ వార్త‌ను రిపోర్ట్ చేయ‌డంలో ఘోర త‌ప్పిదం చేసింది. వార్త చెబుతున్న‌పుడు శశిక‌పూర్ పేరు చెప్పి, విజువ‌ల్స్‌లో మాత్రం అమితాబ్ బ‌చ్చ‌న్‌, రిషి క‌పూర్‌ల వీడియోలు వేశారు.

ఈ వార్త ప్ర‌సార‌మైన‌పుడు తీసిన వీడియో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇంత త‌ప్పిదానికి పాల్ప‌డినందుకు బీబీసీని నెటిజన్లు తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. ఎలాంటి అవ‌గాహ‌న‌ లేకుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లు వార్త వేసినందుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని వారిని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

More Telugu News