google maps: గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచ‌ర్‌.. టూవీల‌ర్ మోడ్‌ని ప్ర‌వేశ‌పెట్టిన గూగుల్‌

  • భార‌తీయ వినియోగ‌దారుల‌కు ప్ర‌త్యేకం
  • గ‌మ్య‌స్థానాన్ని త్వ‌ర‌గా చేరుకునే స‌దుపాయం
  • పార్కింగ్ వివ‌రాల‌ను కూడా తెలుసుకునే సౌక‌ర్యం

ఇప్ప‌టి వ‌ర‌కు గూగుల్ మ్యాప్స్ నావిగేష‌న్‌లో కారు, బ‌స్సు, కాలిన‌డ‌క ద్వారా గ‌మ్య‌స్థానానికి వెళ్లే దారుల గురించిన సమాచారం, అందుకు ప‌ట్టే స‌మ‌యం వంటి సౌకర్యాలు అందుబాటులో వున్నాయి. ఇవాళ్టి నుంచి వాటితో పాటు టూ వీల‌ర్ మోడ్ కూడా చేరిపోయింది. గూగుల్ మ్యాప్స్‌ని అప్‌డేట్ చేస్తే ఈ ఫీచ‌ర్ క‌నిపిస్తుంది.

దీని ద్వారా టూ వీల‌ర్ పై గ‌మ్య‌స్థానాన్ని చేరుకోగ‌ల ద‌గ్గ‌రి మార్గాన్ని, అందుకు ప‌ట్టే స‌మ‌యాన్ని తెలుసుకోవ‌చ్చు. అంతేకాకుండా గమ్య‌స్థానంలో టూ వీల‌ర్ పార్కింగ్ ప్ర‌దేశాల‌ను కూడా మ్యాప్‌లో చూపిస్తుంది.

మోటార్ బైకులు ఎక్కువ వాడే భార‌తీయ వినియోగ‌దారుల‌కు ప్ర‌త్యేకంగా ఈ స‌దుపాయాన్ని ఆవిష్క‌రించారు. కార్లు ప్ర‌యాణించ‌డానికి వీలు లేని ఇరుకు రోడ్లు ఉన్న కొన్ని దేశాల్లో ఈ టూ వీల‌ర్ ఫీచ‌ర్‌ని గూగుల్ ఆవిష్క‌రించింది.

More Telugu News