facebook: పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ కిడ్స్‌!

  • 13 ఏళ్ల వ‌య‌సులోపు వారికి మాత్ర‌మే
  • త‌ల్లిదండ్రుల నియంత్ర‌ణలో యాప్‌
  • పిల్ల‌ల‌కు ఇష్ట‌మైన‌ ఎమోజీలు, ఫిల్ట‌ర్లు

ఫేస్‌బుక్ నిబంధ‌న‌ల ప్ర‌కారం 13 ఏళ్ల లోపు వారు ఖాతా తెర‌వ‌డానికి వీల్లేదు. అయిన‌ప్ప‌టికీ వ‌య‌సు త‌ప్పుగా ఎంట‌ర్ చేస్తూ, పలువురు పిల్ల‌లు ఖాతాలు తెరుస్తున్నారు. అయితే దీనిని క‌ట్ట‌డి చేయ‌డానికి పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా ఓ మెసెంజ‌ర్ యాప్‌ని ఫేస్‌బుక్ ఆవిష్క‌రించింది. 'ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ కిడ్స్‌' పేరుతో ఈ యాప్‌ను అమెరికాలో ప్ర‌స్తుతం ఆపిల్ ఉత్ప‌త్తుల్లో మాత్ర‌మే అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. త్వ‌ర‌లో ఆండ్రాయిడ్‌తో పాటు ఇత‌ర దేశాల్లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ యాప్ ద్వారా పిల్ల‌లు త‌మ త‌ల్లిదండ్రుల‌తో, వారు ఆమోదించిన స్నేహితుల‌తో మాత్ర‌మే చాటింగ్ చేసే అవ‌కాశం ఉంటుంది. అలాగే ఈ యాప్‌లో పిల్ల‌ల‌కు ఇష్ట‌మైన ఎమోజీలు, ఫేస్ ఫిల్ట‌ర్లు మాత్ర‌మే ఉండ‌నున్నాయి.

More Telugu News