Ravichandran Ashwin: కొత్త రికార్డును కొన్ని గంటల్లోనే సరిచేసిన టీమిండియా స్పిన్నర్ అశ్విన్!

  • యాషెస్‌లో నాథన్ లియాన్, ఢిల్లీ టెస్టులో అశ్విన్ రికార్డులు
  • ఈ ఏడాది 54 వికెట్లతో అశ్విన్ సరికొత్త రికార్డు
  • ఐదో స్థానంలో రవీంద్ర జడేజా

ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లియాన్ రికార్డు నెలకొల్పి కొన్ని గంటలైనా కాకముందే టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దానిని సమం చేశాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో అలస్టర్ కుక్, మెయిన్ అలీ, స్టువార్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ వికెట్లను తీసిన లియాన్ మొత్తం 55 వికెట్లతో ఈ సీజన్‌లో అగ్రస్థానంలో నిలిచాడు.

మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఢిల్లీలో శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ విజృంభించి ఏంజెలో మాథ్యూస్, రోషన్ సిల్వా, నిరోషన్ డిక్‌వెల్లా వికెట్లను పడగొట్టిన అశ్విన్ ఈ ఏడాది ఇప్పటి వరకు 55 వికెట్లు పడగొట్టి నాథన్ లియన్‌ సరసన చేరాడు.

లియాన్ ఈ ఘనత సాధించేందుకు 9 టెస్టులు ఆడగా, అశ్విన్ 11 మ్యాచుల్లోనే ఈ మైలు రాయిని చేరుకున్నాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబడ 54 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక బౌలర్ రంగన హెరాత్ 51 వికెట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా రవీంద్ర జడేజ ఐదో స్థానంలో ఉన్నాడు.

More Telugu News