freedom 251: మ‌రోసారి తెర‌మీద‌కి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ వివాదం.. ప్ర‌భుత్వం సాయం చేస్తే ఫోన్లు డెలివ‌రీ చేస్తాన‌ని ప్ర‌క‌ట‌న‌

  • ఇద్ద‌రు వ్య‌క్తుల చేతిలో మోస‌పోయిన మోహిత్ గోయ‌ల్‌
  • వారిపై కేసు పెట్టిన మోహిత్‌
  • అరెస్టు చేసిన పోలీసులు

గ‌తేడాది సంచ‌ల‌నం సృష్టించిన ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ వివాదం మ‌రోసారి తెర‌మీద‌కి వ‌చ్చింది. రూ. 251కే స్మార్ట్‌ఫోన్ అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించిన రింగింగ్ బెల్స్ కంపెనీ అధినేత మోహిత్ గోయ‌ల్ ఫిర్యాదు మేర‌కు నోయిడా పోలీసులు ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన వికాస్ శ‌ర్మ‌, జీతూ అనే వ్య‌క్తులు తక్కువ ధ‌ర‌కే స్మార్ట్‌ఫోన్ అంటూ త‌న ద‌గ్గ‌ర రూ. 3.5 కోట్లు వ‌సూలు చేసి, ఇప్ప‌టికీ ఫోన్లు డెలివ‌రీ చేయ‌లేద‌ని మోహిత్ త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు.

వివాదానికి అస‌లు కార‌కులెవ‌రో ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంద‌ని, వారి గురించి తెలియ‌క పంపిణీదారులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో తాను ఆర్నెల్లు జైలు శిక్ష అనుభ‌వించాల్సి వ‌చ్చిందని, ప్ర‌భుత్వం స‌హ‌క‌రిస్తే మార్చి-ఏప్రిల్ లోగా ఫోన్లు స‌ర‌ఫ‌రా చేస్తాన‌ని మోహిత్ తెలిపారు. ప్ర‌స్తుతం త‌న ఐడియా కాపీ కొట్టి జియో, కార్బ‌న్ కంపెనీలు త‌క్కువ ధ‌రకు స్మార్ట్‌ఫోన్ల‌ను త‌యారుచేస్తున్నాయ‌ని ఆరోపించారు. త‌న ఐడియా `మేకిన్ ఇండియా`కు ప్రోద్బలంగా ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం త‌న‌కెలాంటి సాయం చేయ‌లేద‌ని మోహిత్ వెల్ల‌డించారు.

More Telugu News