venkatesh: తేజ దర్శకత్వంలో వెంకీ న్యూ మూవీ మొదలైంది

  • వెంకటేశ్ హీరోగా తేజ తాజా చిత్రం 
  • రామానాయుడు స్టూడియోలో పూర్తయిన పూజా కార్యక్రమాలు
  • త్వరలో రెగ్యులర్ షూటింగ్ 
  • సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్  

తేజ దర్శకత్వంలో వెంకటేశ్ ఒక సినిమా చేయనున్నాడనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. వెంకటేశ్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 13వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారనే వార్తలు షికారు చేశాయి. అయితే ఈ రోజు ఉదయమే ఈ సినిమాను లాంచ్ చేసేశారు. హైదరాబాద్ - రామానాయుడు స్టూడియోలో చాలా సింపుల్ గా జరిగిన పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది.

 త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. సురేశ్ ప్రొడక్షన్స్ .. ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్ ను తీసుకున్నారు. త్వరలోనే మిగతా నటీనటులు .. సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడి చేయనున్నారు. ఈ సినిమాలో ఒక కీలకమైన రోల్ ను రాజశేఖర్ చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వాస్తవమెంతన్నది చూడాలి మరి.   

More Telugu News