Jharkhand: ఏడేళ్ల బాలికపై దాష్టీకానికి దిగి... చాలా చిన్న ఘటనగా తోసిపుచ్చిన నీచ ప్రిన్సిపాల్!

  • బాత్ రూములోకి తీసుకెళ్లి పాడు పనులు
  • మీడియా ముందు అంగీకరించిన ప్రిన్సిపాల్
  • అత్యాచారం చేయలేదు కాబట్టి చిన్న ఘటనేనట

తన పాఠశాలలో చదువుతున్న ఏడేళ్ల చిన్నారిపై దాష్టీకానికి దిగింది కాకుండా, నిస్సిగ్గుగా మీడియా ముందు ఆ విషయాన్ని ఒప్పుకుని, దాన్ని చాలా చిన్న ఘటనగా అభివర్ణించాడో ప్రబుద్ధ ప్రిన్సిపాల్. జార్ఖండ్ లోని కోడెర్మా జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఎస్ జేవియర్ అనే పాఠశాల ప్రిన్సిపాల్, యూకేజీ విద్యార్థిని స్కూలు టాయిలెట్ లోకి తీసుకెళ్లి, బట్టలు విప్పదీసి, తాకకూడని చోట తాకుతూ గట్టిగా కొరుకుతూ తనలోని పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు.

 బాలిక ఏడుస్తుంటే, చాక్లెట్లు చేతిలో పెట్టి, విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బతిమాలి పంపించాడు. ఆ పాప విషయం ఇంట్లో చెప్పడంతో, పోలీసులకు ఫిర్యాదు అందగా, సదరు ప్రిన్సిపాల్ ను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. మీడియాతో మాట్లాడిన క్సేవియర్, "అవును నేనలా చేశాను. కానీ అదేమీ పెద్ద తప్పు కాదు. అక్కడ పాపను నేను బలాత్కరించలేదు. నేను నిజం చెబుతున్నాను. ఎలాంటి ఇంటర్ కోర్స్ కూడా జరగలేదు. నేను ముసలివాడిని. అది అసంకల్పితం. ఎంతో ఒత్తిడితో ఉన్నాను. గుండె జబ్బు ఉంది. రాత్రుళ్లు నిద్రపట్టదు. ఇన్సోమ్నియా వ్యాధి కూడా ఉంది" అంటూ చెప్పుకుపోయాడు. కాగా, ఈ కేసులో ప్రిన్సిపాల్ ను కోర్టు 15 రోజుల రిమాండ్ నిమిత్తం జైలుకు పంపింది. పోలీసులు కేసు దర్యాఫ్తు చేస్తున్నారు.

More Telugu News